Friday, July 13, 2012

తాగుడు నిర్ణయాలు

ప్రస్తుతం మనం మన సంస్కృతినిప్రజాభిప్రాయం ద్వారా కాకుండా, కేవలం కొన్ని వ్యాపారపరమయిన సంస్థలకణుగుణంగా తయారు చేసుకుంటున్నాము. ఒకప్పుడు పొగతాగకపోతే వాడు మగాడే కాదు. ఈనాడలా లేదు. నేడు తాగకపోతే మగాడు కాదు అన్నట్టుగా సమాజం తయారయింది. మీరు జీవితంలో విజయాన్ని సాధించినవారయితే తప్పనిసరిగా తాగాలి. ఈ విధంగా మనం మన నాశనానికి దారితీసే సంస్కృతిని అలవరుచుకుంతున్నాం. ఇది పూర్తిగా వ్యాపార సంస్థల ద్వారా పోషించబడుతున్న సంస్కృతి. ఇది ఏ హద్దు వరకూ వెళ్ళిందంటే, వ్యాపార సంస్థలు మనుషుల చేత మన్ను తినిపించాలన్నా, వ్యాపార ప్రకటనల ద్వారా ఏ సినిమా నటుడితోనో మన్ను తినిపించి మనచేత కూడా మన్ను తినిపించగలరు; వారీ విషయంలో మంచీచెడు పట్టించుకోరు.
తాగడం తాగకపోవడం అనేది పూర్తిగా ఒక మనిషి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. చావుబతుకుల మధ్య తేడా ఒకటే, చావులో మీరు చేతనులై ఉండరు, బతుకులో మీరు చేతనమయి ఉండొచ్చు. నిద్రలో మీరు అచేతనులు; నీరసావస్థలో చేతనులుగా ఉండే శక్తి ఉండొచ్చు. బతుకనేది మీరు చేతన ఇంకా మెలకువలో ఉంటేనే సాధ్యం. తాగుడు మత్తునిస్తుంది, అది మిమ్మల్ని చేతనావస్థ నుండి దూరంగా లాక్కుపోతుంది. మీరు మనశ్శాంతికై ఏ ప్రయత్నమూ చేయకుండా అనిర్మలమయిన మనస్సుతో ఉండటం వలన సాయంత్రమో, ఆఫీసు పార్టీలోనో తాగే మందు పెద్ద మనశ్శాంతిని ప్రసాదించే మార్గంలా అనిపిస్తుంది.
మనస్సు ఒత్తిడిలో ఉన్నా, ఉగ్రముగా ఉన్నా, పొందనిదాని కోసం పరితపిస్తున్నా, తాగుడులోని మత్తు పెద్ద ఉపశమనంలా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మనం మన శరీరానికి తెలిపితే, అదే బతుకు నుండి దూరంగా చేసేవన్నీ ఉపశమనానికి మార్గాలని గుర్తిస్తుంది. ఇక అక్కడితో మృత్యువాతపడటం చాలా సులభం.
--సద్గురు జగ్గీ వాసుదేవ్ 

6 comments:

  1. Alcohol drinking is one of much bigger social evil today & pub culture in cities is not helping. Some folks I know have this misconception is that alcohol is evil for just poor folks, but in fact, it equally effects all. The money spent on it for a year could buy a middle class family a good long distance vacation. The time for it could be well spent elsewhere. Not everyone is cut out for digesting alcohol as the middle class does not do hard labor jobs leading to all sorts of health problems [esp brahmins YES!]. Even most intelligent folks easily forget that its a addiction and is very hard to rid off once hooked.

    ReplyDelete
  2. తాగుడు చేతనావస్థ నుండి దూరంగా లాక్కుపోతుంది...కరెక్టుగా చెప్పారు.. దానివల్లనే మనిషి మృగంలా మారుతున్నాడు...
    ఈ మనుషులు ఆ నిజాన్ని తెలుసుకొని ఎప్పుడు మంచిగా మారుతారో ఏమో ?

    ReplyDelete
  3. చేతన నిష్ప్రయోజనమై కేవలం బాధనుమాత్రమే మిగులుస్తుంటే, గాయాలను రేపుతుంటే... ఆ చేతనను కాసేపు వద్దనుకుని స్థబ్దంగా, ప్రశాంతంగా వుండాలని అలిసిపోయిన/బలహీనమైన మనసు ఆరాటపడితే?!!
    Snkr

    ReplyDelete
  4. ఒక విన్నపం. మీ తెలుగు అభిమానం ముచ్చటైనది కానీ, మన ఆకాంక్షలు శూభప్రదంగా ఉండాలి, శాపనార్ధాలతో కాదు. దయచేసి మీ బ్లాగు టేగులైంగా ఉన్న పద్యపంక్తిని మార్చగలరేమో చూడండి.

    ReplyDelete
  5. మీ బ్లాగ్ టాగ్ లైన్ కటువుగా ఉంది. దాని మార్చండంటూ నారాయణస్వామి గారు చేసిన సూచన మీకు నచ్చినట్టు లేదు. సరే, అది మీ ఇష్టం!
    ఇంతకీ ‘ఆంధ్రందు’ అనే సంధి ఎలా సాధ్యం? ఆంధ్ర+ అందు= ఆంధ్ర యందు అవుతుంది కదా?

    ReplyDelete
  6. నారాయణస్వామి గారూ, అది నేను అన్న మాట కాదు. కాళోజీ గారి మాటలు. అంతకన్నా నిష్ఠూరపు మాటలనాలనుంటుంది అప్పుడపుడూ. ఈ మాటలు నేను వెనక్కు తీస్కునే రోజు త్వరలో రావాలని నాకూ ఉంది.

    వేణు గారూ, ఒక మహనీయుని మాటల్లో అక్షరదోషాలున్నా(పలికే యాసకూ, రాసే భాషకూ చాలా తేడా కలదు), అవి మౌఖిక భాషలోని అందాలననుకొని ఆస్వాదించాలి!

    ReplyDelete